చాగంటి సత్సంగ్ మరియు సువర్ణభూమి వారు కలిసి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) చందనోత్సవం కార్యక్రమం లో సింహాచలం యాత్రికులకి తీర్థ ప్రసాదాలతో పాటు తులసి మొక్కలని పంచిపెట్టారు.
చందనం అంటే పైపూత కాదు… . చందనం పరిమళం కాదు… ఓ అమూల్య సంప్రదాయం… అదో ఆధ్యాత్మిక సుగంధం… సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా ఈ చెట్టు అణువణువూ ఎందుకు పూజనీయమైంది?
ఏ దైవానికీ లేని ఎన్నో విశిష్టతలు సింహగిరి నరహరికే సొంతం. ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ, సంవత్సరమంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ… ఒక్కరోజు మాత్రమే నిజ రూపంతో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం సింహాచలం. 364రోజులు చందనంలో ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే స్వామి… వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే నిజరూపంతో సేవలందుకుంటాడు. వేడుకగా జరిగే ఈ ప్రక్రియలో ముఖ్య ఘట్టాలివీ..